జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
వ్యవసాయ, ప్రజామోగ్యం లేని బడ్జెట్ అని. సంక్షేమాన్ని విస్మరించారాని సీపీఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఆరోపించారు. సిరికొండ లో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన మాట్లాడుతు: కార్మిక సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది అన్నారు. బీడీ కార్మికులుతో పాటు లక్షల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కార్మిక సంక్షేమానికి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఇలా వ్యవహారించడం సరి అయింది కాదన్నారు. బడ్జెట్ లో 998: కోట్లు మాత్రమే కేటాయించింది అన్నారు.రైతే దేశానికి అన్నదాత అని చెప్పి వ్యవసాయ రంగానికి నిధులు మాత్రం పెంచకుండా హరాకోరా కేటాయించడం సరియైన పద్ధతి కాదన్నారు. కేవలం 23179 కొట్లు కేటాయించరన్నారు. రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారికిచ్చే నిధుల్లో పెంచకపోవడం ఏం పద్ధతి అన్నారు. అలాగే వైద్యం పట్ల ప్రభుత్వం బడ్జెట్లో చిన్న చూపే కనిపిస్తుంది అన్నారు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే వైద్యం పడకేసిందని సరియైన నిధులు కేటాయించకపోతే వైద్యఅసేవలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజాఆరోగ్యంకూ 13679 కోట్లు కేటాయించారు అన్నారు. వ్యవసాయ రంగానికి ఏది ఏమైనా కార్మిక రంగానికి, వ్యవసాయ రంగానికి, ప్రజా వైద్యనికి ఆశజనకంగా లేదు అని, ప్రజలు ఆమోదించరు అన్నారు సమావేశం లో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు బి కిశోర్, ఈ రమేష్, ఎస్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


