జుక్కల్ మార్చి 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సబ్ కలెక్టర్ కిరణ్ మై సమావేశం నిర్వహించినారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ జుక్కల్ మండలంలో ని 30 గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే నేరుగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని సబ్ కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈఓ చందర్ నాయక్, డిపిఓ మురళి పిడి హౌసింగ్ డిఎల్పిఓ హౌసింగ్ ఈడి ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ రాములు తదితరులు పాల్గొన్నారు.




