Listen to this article

జిల్లా వైద్య అధికారికి ఘన సన్మానం…

జుక్కల్ మార్చ్ 20 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా వైద్య అధికారి రవీందర్ గౌడ్ శుక్రవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వారిని జుక్కల్ ఆసుపత్రి వైద్యులు మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కలిసి వైద్య అధికారిని సన్మానించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ఆశపత్రిలో పేదలకు అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యుడు విట్టలను అడిగి తెలుసుకున్నారుఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలని అన్నారు రోగులకు సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పించాలని స్థానిక వైద్యుడిని ఆదేశించారు.ఆస్పత్రిలో సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు స్టాక్ తెచ్చుకోవాలని సూచించారు.