Listen to this article

జనం న్యూస్ మార్చ్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రార్థనలు ప్రశాంతంగా, భక్తులు సురక్షితంగా నిర్వహించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.ప్రాంతంలోని 12 మసీదుల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలకు చెందిన సిబ్బందిని సమర్థంగా మోహరించి, భక్తుల రద్దీని నియంత్రిస్తూ ట్రాఫిక్‌ను సజావుగా నడిపే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మసీదుల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. అదేవిధంగా, సున్నిత ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ బృందాలు తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కోణాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించినట్లు తెలిసింది.సీనియర్ అధికారులు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను అమలు చేశారు. ప్రజలు, నిర్వాహకులు అందించిన సహకారంతో రంజాన్ ప్రార్థనలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా సాగడం పోలీసు వర్గాలు అభినందించాయి.