పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నూర్ బాషా/దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు షేక్ సాదుల్ల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైన ముస్లిం సోదరులు, అదే స్ఫూర్తితో శనివారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.


