Listen to this article

జనం న్యూస్ మార్చి 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ శివారులో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ను పొల్యూషన్ ఏఈ సుభాష్ శుక్రవారం తనిఖీ చేశారు. క్రషర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. దుమ్ము ధూళి లేవకుండా నీటిని ఎప్పటికప్పుడు స్ప్రే చేయకుండా క్రషర్ యజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని గ్రహించారు. అనంతరం గ్రామంలో క్రషర్, డాంబర్ ప్లాంట్ వల్ల వచ్చే అనర్ధాలను అడిగి తెలుసుకున్నారు. డాంబర్ ప్లాంటు నుండి వచ్చే దుర్వాసన వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఏఈకి తెలిపారు. క్రషర్ నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల వల్ల ఇండ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని ఏఈ దృష్టికి తీసుకొచ్చారు. డాంబర్ ప్లాంట్ వాసన దుర్వాసన వస్తున్నదని వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏఈ స్పందిస్తూ క్రషర్ డాంబర్ ప్లాంట్ వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పై అధికారులకు తెలియజేశారు. వారి వెంట ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్ లు ప్రశాంత్ రాజు మహేందర్ రమేష్ సాయి లక్ష్మి ప్రశాంత్ చిట్టి రెడ్డి పద్మ తదితరులు ఉన్నారు….