జనం న్యూస్ మార్చ్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ; అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయం లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ వెంకటేశ్వర కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎం.వి.ఆర్ తో పాటు సుమారు 100 మంది పైగా అనుచరులు, స్థానిక సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎం.వి.ఆర్ తెలిపారు.ఈ సందర్భంగా పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ, రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం మెట్ట నానాజీ, గంటా సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, పోలవరపు లోకేష్ అధిక సంఖ్యలో ఎం వి ఆర్ అభిమానులు పాల్గొన్నారు


