జనంన్యూస్. 21. సిరికొండ.శ్రీనివాస్ పటేల్.నిజామాబాదు రురల్ సిరికొండ మండలకేంద్రం లోపవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగను పురస్కరించుకుని, సిరికొండ మండలంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ సిరికొండ మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మొట్టల దీపక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దానగుణం, భక్తి భావాలకు ప్రతీక రంజాన్ పండుగ అని పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, సమాజ శ్రేయస్సు కోరుతూ జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా మనమందరం కలిసిమెలిసి ఉంటూ, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.ఈ ఈద్ పర్వదినం మండల ప్రజలందరి మధ్య సోదరభావాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకుంటూ, ముస్లిం సోదరులకు మరోసారి ఈద్ ముబారక్ తెలియజేశారు.మొట్టల దీపక్,ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు, సిరికొండ.


