విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషితో వెల్లివిరిసిన అద్భుతమైన వార్షిక వేడుక.
ప్రధాన అధ్యాపకులు చంద్రకాంత్ గౌడ్,
జనం న్యూస్,మార్చ్ 22,కంగ్టి,సంగారెడ్డి జిల్లా
కంగ్టి మండలంలోని స్థానిక లిటిల్ స్టార్ పాఠశాల 13వ వార్షిక ఉత్సవాన్ని శనివారం స్థానిక బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్ లో చదువుల తల్లి సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలతో దీపారాధన గావించి ప్రారంభించారు. విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతి సాంప్రదాయ అన్నమయ్య వేషధారణతో నృత్య, నాట్య,ప్రదర్శనలతో దర్శకులకు మంత్ర ముగ్ధులను చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు మనం మన పాఠశాల 13వ వార్షిక దినోత్సవంను జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ కార్యక్రమం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు,గత సంవత్సరం పాఠశాల విద్యార్థులు సాధించిన ప్రగతిని సమీక్షించుకునే, విజేతలను అభినందించుకునే ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు.మా పాఠశాల విశిష్టత, కేవలం పుస్తక జ్ఞానాన్ని అందించడం కాదు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలను పెంపొందించడం మా పాఠశాల ప్రధాన లక్ష్యం అని అన్నారు.నేటి ప్రపంచంలో పోటీని తట్టుకుని నిలబడేలా, ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా, విద్యార్థులను తయారు చేయడమే మా పాఠశాల విశిష్టత అని అన్నారు.గత విద్యా సంవత్సరంలో మా విద్యార్థులు పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు అని అన్నారు.విద్యార్థులలో వ్యవస్థాపకత నైపుణ్యాలను పెంపొందించాము.సామాజిక బాధ్యత రక్తదాన శిబిరాలు, డెంగ్యూ అవగాహన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవ చేసే దిశగా విద్యార్థులను దిశ నిర్దేశం చేశామని అన్నారు.మా పాఠశాలలో సాంకేతికతతో కూడిన విద్యను,సంస్కృతిని మిళితం చేసి పాఠ్యాంశాలను బోధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థుల సంరక్షకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


