జనం న్యూస్ మార్చి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కాలనీలలో నీటి సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల ఫలితంగా ఈరోజు కాలనీలో హై ప్రెజర్‌తో తాగునీటి సరఫరా విజయవంతంగా జరిగింది. దీని ద్వారా స్థానిక ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.అయితే, కొన్ని గృహాలకు నీరు అందకపోవడానికి ప్రధాన కారణాలు గమనించబడినవి. ముఖ్యంగా: వాల్వ్‌ల వద్ద ధూళి (డస్ట్) పేరుకుపోవడం, పైపులైన్ లోతు (డెప్త్) సరైన విధంగా లేకపోవడం,కొత్తగా నిర్మించిన ఇళ్ల వద్ద పైపులైన్‌ను ఎక్కువ లోతులో వేయడం వలన పాత ఇళ్లకు నీటి సరఫర తగ్గిపోవడం.ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ ఇంటి పైపులైన్‌ను సరైన లోతులో ఏర్పాటు చేసుకోవాలని, అలాగే వాల్వ్‌లను నిరంతరం శుభ్రపరచుకోవాలని కోరడమైనది.ఏదేమైనా, ఈరోజు గోపాలనగర్,శిల్ప,విశ్వంభరలో నీరు అధిక ఒత్తిడితో సరఫరా కావడం ఆనందకరమైన విషయం అని తెలియజేస్తున్నాము.ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ నాయకులుగా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నాము.


