జనం న్యూస్ : పెబ్బేరు మార్చి 23 వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లాలో
తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నమెంట్ ఛాంపియన్ గా ఉమ్మడి పెబ్బేరు మండల రైడర్స్ టీం0నిలిచింది. టోర్నమెంట్లో మొదటి నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఫైనల్లో వీపనగండ్ల టీం పై అద్భుత విజయాన్ని చేజిక్కించుకుని తొలి టోర్నమెంట్ లో తొలి ఛాంపియన్ గా నిలిచింది. ఛాంపియన్ గా నిలిచిన ఉమ్మడి పెబ్బేరు రైడర్స్ టీంకి వనపర్తి జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు మరియు వివిధ మండలాల మండల విద్యాధికారులు విన్నర్ ట్రోఫీని అందించారు. టోర్నమెంట్లో రన్నరప్ గా నిలిచిన వీపనగండ్ల టీంకి రన్నరప్ ట్రోఫీని అందించారు. ఇట్టి కార్యక్రమం సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఉపాధ్యాయులు అనునిత్యం నాలుగు గోడల మధ్య దేశాభివృద్ధికి పునాదులు వేస్తుంటారని అలాంటివారు ఈ సెలవు రోజుల్లో జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మానసికంగా ఫిట్ గా ఉండడంతో పాటు శారీరకంగా కూడా ఫిట్ గా ఉంటే విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించగలుగుతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నీలు నిర్వహించుకుందామని పేర్కొన్నారు.
ఇట్టి కార్యక్రమానికి జిల్లా సెక్టోరల్ అధికారులు శ్రీ మహానంది గారు, శ్రీ ప్రతాప్ రెడ్డి గారు, శ్రీ శేఖర్ గారు, వివిధ మండలాల మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దమొత్తంలో హాజరయ్యారు.


