జనంన్యూస్. 23.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం గడ్కోల్, కొండాపూర్ గ్రామములో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో “కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతి భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ నూనూగు మీసాల నవ యవ్వన వయస్సులో ఉరికొయ్యలకు వేలాడిన షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, వారి పోరాట స్ఫూర్తి నేటి విద్యార్థి ,యువతకు స్ఫూర్తిదాయకమని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల నాయకులు ఇ రమేష్.అన్నారు.సోమవారం గడ్కోల్, కొండాపూర్ లోని భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళులు హార్పించారు. భారత జాతీయోద్యమ వీరులు షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఇ రమేష్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ, దేశ సంపదను స్వదేశీ ,విదేశీ కార్పోరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
79 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో ప్రభుత్వాలు దేశం లోని పేదలకు ఉచితంగా నాణ్యమైన సమాన విద్య ,వైద్యాన్ని అందించడం లో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. మోడీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ బద్ధ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, పౌరుల ప్రజాస్వామిక హక్కులను, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని, దేశ లౌకిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. ప్రశ్నించే గొంతులను అర్బన్ నక్సల్స్ అంటూ అన్యాయంగా ముద్ర వేసి అక్రమంగా జైల్లో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.దేశంలో నూతన జాతీయ విద్యా విధానం- 2020 అమలు పేరిట విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం ,ప్రశ్నించే తత్వం కొరవడుతున్నదని, పాఠ్యపుస్తకాల్లో నుంచి జాతీయ ఉద్యమ వీరుల పోరాట త్యాగాలను, సమానత్వాన్ని బోధించే సోషలిస్టు భావాలను, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాలను తొలగించి, కుల, మత, మనువాద, అశాస్త్రీయ భావాలను ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం ,ప్రశ్నించే తత్వం కొరవడి మత భక్తియే దేశభక్తి అనే భ్రమలను భావి భారత పౌరులకు కల్పిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించి కేవలం 8. 23% నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నదని , గత నాలుగు సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఇవ్వవలసిన పెండింగ్ స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. PYL రాష్ట్ర నాయకులు కె ఆశిస్ మాట్లాడుతు:నేటి విద్యార్థి, యువత భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో విద్య ,ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని, ఇరాన్ పై ఇజ్రాయిల్ -అమెరికా కొనసాగిస్తున్న యుద్ధోన్మాధ దాడులను ఖండించాలని, దేశంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న కుల, మతోన్మాద పాసిజాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐయుకెఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి ఎం లింబాద్రి, డివిజన్ నాయకులు ఎం నారగౌడ్,మండల నాయకులు కట్ట రాములు, నిమ్మల రాములు, ఎం భూమాగౌడ్, టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అనిస్, ఏఐపికెఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జె బాల్ రెడ్డి, సహాయకార్యదర్శి ఎం సాయరెడ్డి, కె రాంజీ, పివై ఎల్ నాయకులు బి నర్సయ్య, బి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.



