Listen to this article

జనం న్యూస్ మార్చి 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ “చలో అసెంబ్లీ ముట్టడి” కార్యక్రమానికి సోమవారం (23/03/2026) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విశేష స్పందన లభించగా, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆదివారం రాత్రి పోలీసులు బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి ని వారి నివాసంలోనే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. ఈ చర్యపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ సందర్భంగా మొగిలి మాట్లాడుతూ, ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను ఇలా ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. లాఠీలు, తూటాలు, అక్రమ కేసులు, అరెస్టులు వంటి దమనకాండ చర్యలతో బీజేపీ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని, ఈ ద్రోహానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఈ ధర్మపోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అరెస్టులు చేసినా, ప్రజల హక్కుల కోసం పోరాటం ఆగదని, చివరి వరకు బీజేపీ శ్రేణులు పోరాడతాయని ఘాటుగా హెచ్చరించరూ…