జనం న్యూస్: మర్చి 23 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్
నిడనూరు మండల కేంద్రంలో సోమవారం సిపిఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు షహీద్ భగత్ సింగ్ 95 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్,సీఐటీయూ జిల్లా నాయకులు కోమాండ్ల గుర్వయ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడయ్యాడని వారన్నారు. 200 సంవత్సరాల బ్రిటీష్ పాలనలో దేశ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి చిన్నప్రాయంలోనే దేశం పట్ల అమితమైన ప్రేమ గౌరవంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన స్నేహితులతో కలిసి రహస్యంగా పోరాడారని వారన్నారు. కుటుంబానికి చదువులకు దూరమై, తనకు బంగారు భవిష్యత్తు ఉన్నప్పటికీ వాటన్నిటిని కాదని దేశం కోసం పోరాడే అమరుడైన గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్ అని ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడిన అమరుల్లో భగత్ సింగ్,రాజుగురు, సుఖదేవ్ ఉన్నారని వారికి సందర్భంగా జోహార్లు అర్పించారు. దేశం పట్ల భగత్ సింగ్ కి ఉన్న దేశభక్తి నేటి విద్యార్థి యువజనలకు ఆదర్శనీయమని వారన్నారు. దేశం కోసం వీరమరణం పొందిన నాటి వీరుల చరిత్రలను నేటి తరానికి తెలియకుండా మనువాదులు కుట్రలు చేస్తున్నారని, చరిత్రను చరిత్రగానే నేటి తరాలకు అందించాలని వారు అన్నారు. స్వాతంత్ర సమరయోధులను చరిత్రను వక్రీకరించే వారి పట్ల ప్రజల్లో ప్రభుత్వం గా ఉండే తగిన బుద్ధి చెప్పాలని వారు సందర్భంగా కోరారు కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మల్లికాంటి చంద్రశేఖర్, కోరే రమేష్, వేంపటి మహేష్, బొడ్డు లింగయ్య, వర్షిత్, కోమాండ్ల ఆంజనేయులు, విష్ణు, మధు, వెంకన్న, వింజమూరి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు


