అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు-గణేష్ తంగరాజు
జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన విజయపురి టౌన్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కమిషన్ల పాలనను కొనసాగిస్తుండటాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నందికొండ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులు గణేష్ తంగరాజు, కొమ్ము రాందాస్, ఎర్రబోయిన రాజు తదితరులను నందికొండ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదలి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమ కమిషన్ల కోసం అవినీతి పాలన చేస్తున్నారని వీరికి ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.


