సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 23. 03. 2026
దేశ సేవలో విశేష సేవలందించి రిటైర్డ్ అయిన ఆర్మీ అధికారిని ఘనంగా సన్మానించిన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎస్సై కాశీనాథ్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులు మరియు ఆర్మీ అధికారుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. రిటైర్డ్ ఆర్మీ అధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా అభినందించారు. ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశ భద్రత కోసం కష్టపడి పనిచేసిన వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు మరియు పలువురు పాల్గొని రిటైర్డ్ ఆర్మీ అధికారిని అభినందించారు.



