జనం న్యూస్ మార్చి 23: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో సోమవారం రోజునా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెజ్జారం పావని భానుచందర్, ఉపసర్పంచ్ చాట్ల జనార్దన్ పాల్గొన్నారు. పశువైద్యాధికారి డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నుండి పశువులను రక్షించేందుకు రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది నరేందర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


