జనం న్యూస్ -మార్చి 24- నాగార్జునసాగర్ టౌన్ –
నాగార్జునసాగర్ డి ఏ వి హైస్కూల్ 9వ తరగతికి చెందిన విద్యార్థి దొరై సాత్విక్ రాజ్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపిక. ఫిబ్రవరి 20నుంచి 23 వరకు మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్రస్థాయి నెట్ బాల్ కాంపిటీషన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి బాయ్స్ టీంకు ఎంపికైనట్లుగా పాఠశాల పి ఈ టి ఏ సాయికృష్ణ తెలిపారు. మార్చి 27 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని శ్రీ ప్యారేజీ మహారాజ్ స్పోర్ట్స్ అకాడమీలో జరగనున్న 38వ జూనియర్ జాతీయస్థాయి నెట్ బాల్ ఛాంపియన్షిప్ నాలుగవ ఫాస్ట్ 5 జూనియర్ పోటీలలో తెలంగాణ జట్టు తరఫున ఆడనున్నట్లుగా తెలిపారు. నెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ జాతీయ బాలుర జట్టుకు ఎంపికైన దొరై సాత్విక్ రాజ్ ను నాగార్జునసాగర్ జెన్కో సి ఇ వి మంగేష్ కుమార్, ఎస్ ఇ బి రఘురాం, సివిల్ ఎస్ సి డి రామకృష్ణారెడ్డి, ఈ సత్య శివకుమార్, జి ఆర్ కే ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే పవన్ కుమార్, పి ఈ టి ఏ సాయికృష్ణ, ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థులు అభినందించారు.


