జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ప్రజా యుద్ధనౌకగా పిలువబడే గద్దర్ మీద అగ్రకుల పాలకులు కాల్పులు జరిపినప్పుడు మాన్యవర్ కాన్షిరాం గారు చెప్పినదే నిజమనిపిస్తుంది. 1997 ఏప్రిల్ 6న గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు భారతదేశం మొత్తం ఉలిక్కిపడిన సందర్భం. ఇక్కడ గద్దర్ మీద కాల్పులు,అక్కడ ఉత్తర భారత దేశంలో, దక్షిణ భారతదేశానికి చెందిన పెరియర్ రామస్వామి నాయకర్ పేరుమీద పెరియార్ మేళా అద్భుతంగా జరుగుతున్న సందర్భం.
పెరియార్ మేళాను ముగించుకొని గద్దర్ విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్యవర్ కాన్సిరాం ఆంధ్ర ప్రదేశ్ కు రావడం జరిగింది. సికింద్రాబాద్ లో రైలు దిగిన వెంటనే చక్కగా గద్దర్ ఉన్న నిమ్స్ హాస్పిటల్ కు పరామర్శించడానికి వెళ్ళాడు. ఏ జాతీయ నాయకుడు కూడా గద్దర్ ని పరామర్శించడానికి రాలేదు. ఎందుకంటే ఆనాడు ఉన్న జాతీయ పార్టీల అధ్యక్షులు మొత్తం అగ్రకుల నాయకులు. గద్దర్ పై అభిమానం ఉన్న కాన్షిరాం ఆగమేఘాల మీద గద్దర్ దగ్గరికి రావడం జరిగింది. మీ నక్సలైట్ పార్టీల నాయకులు కాన్సిరాం కు గద్ద


