Listen to this article

జనం న్యూస్ 12ఫిబ్రవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపుమేరకు పెగడపల్లి మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికుల కరపత్రం విడుదల చేశారు. అనంతరం ఇరుగురాల భూమేశ్వర్ మాట్లాడుతూ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం తీసుకురావాలని కోరారు. సంక్షేమ బోర్డులో ఉన్న కోట్లాది రూపాయలు ఇతర అవసరాలకు ప్రభుత్వం వాడకుండ కార్మికులకే చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో కార్మికుల ఐక్యతను చాటుతూ జిల్లా 3వ మహాసభను అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయగలరని అన్నారు… డిమాండ్స్ : నూతన లేబర్ కార్డులు జారీ చేయాలి సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలిఅర్హులైన కులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి.భావన నిర్మాణ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వాలి.యాక్సిడెంట్ డెత్ 10 లక్షలు ఇవ్వాలి.థంబ్ సిస్టం రద్దు చేయాలి.డెలివరీ ప్రసూతి యాభై వేలు ఇవ్వాలి.55 సంవత్సరాలు నిండిన కార్మికులకు 3000 పెన్షన్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శనిగారపు ప్రవీణ్, ఏఐటీయూసీ మండల కన్వీనర్ రాచర్ల సురేష్, బొమ్మనశంకర్, బొమ్మన బాబు, సుంకే ప్రకాష్, బొమ్మన పురుషోత్తం,మల్యాల అంజయ్య, వడ్లూరి అంజయ్య, బొల్లం రవి, బైర అంజయ్య, బైరరాజ్ కుమార్, బొమ్మన శంకర్, తదితరులు పాల్గొన్నారు..