జనం న్యూస్ మార్చి 24 జగిత్యాల జిల్లా బీర్ పూర్
మండల కేంధ్రానికి చెందిన అప్పాల మల్లేశం ఇటీవల మరణించగా ఈ రోజు ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ తుంగూరు శాఖ వారు బ్యాంకు ఖాతాదా రుడు మల్లేశం కుటుంబ సభ్యులకు వారికి (ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన) పథకం ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కు ఈరోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా వారి భార్య అప్పల గంగవ్వ గారికి బ్యాంకు మేనేజర్ హరిప్రసాద్ అందించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకం చేయించుకోవాలని బ్యాంకు లు ఆర్థికంగా సహాయపడతాయని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో బీర్పూర్ సర్పంచ్ హరీష్ తుంగూర్ సర్పంచ్ రాజగోపాల్ రావు మాజీ కే డి సి సి మెంబర్ ముప్పాల రామచంద్ర రావు పి ఏ సి సి సెక్రటరీ తిరుపతి అన్ని గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు


