జనం న్యూస్ మార్చి 24 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల
కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 28 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అనంతరం బీర్పూర్ మండల కేంద్రంలో 1 కోటి 43 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను స్తానిక నాయకులు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే త్వరితగతిన ఆసుపత్రి పనులు పూర్తి చేసి,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమేష్ ఎమ్మార్వో సుజాత కే మాజి కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రాజగోపాల్ రావు, హరిష్ తిరుపతి రంగు లక్ష్మణ్ బీరు పూర్ ఆలయ చైర్మన్ చీర్నేని శ్రీనివాస్ అధికారులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



