జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
నందలూరు మండలం ఆడపూరు సచివాలయం పరిధిలోని ఆడపూరు ఎగువ హరిజన వాడ గ్రామాన్ని కడప జిల్లా మలేరియా అధికారిని పి మనోరమ తనిఖీ చేసిరి. ఆ గ్రామములో గత 10 రోజుల నుండి ఒళ్ళునొప్పులు మరియు జ్వరంతో బాధపడు తున్న వారికి ఆరోగ్య సిబ్బంది చికిత్స చేసిన వారిని సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితినిఅడిగితెలుసుకోనిరి. ఈరోజు కూడా మెడికల్ క్యాంపు మరియు ప్రతి ఇంటిని పరిశీలించి లార్వా సర్వే మరియు ఫీవర్ సర్వే చేస్తున్న వైద్య సిబ్బందిని డి ఎం ఓ మనోరమ ఆకస్మిక తనిఖీ చేసి, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని దోమలు పెరిగే నీటి నిల్వలను నిర్మూలించా లని ప్రతి రాత్రి వీలైనంత త్వరగా డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసుకోవాలని, దోమతరలు, మస్కిటో కాయిల్స్ వాడి దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, జ్వరము వచ్చిన వెంటనే పి హెచ్ సి కి వెళ్లి రక్తపరీక్షలు చేయించు కోవాలని సూచించారు.ప్రజలు చెప్పిన విషయాలకు పీహెచ్ లొ ఇస్తున్న వైద్య సేవలకు సంతృప్తి చెంది డాక్టర్ శరత్ కమల్ మరియు డాక్టర్ కార్తీక్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు,హెల్త్ అసిస్టెంట్ మధుసూదన రెడ్డి, సి హెచ్ సి సబితా, ఏఎన్ఎం శాంతకుమారి మరియు ఆశ కార్యకర్త నాగ సుబ్బమ్మ పాల్గొనిరి .


