జనం న్యూస్ మార్చి(24) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో మద్దిరాల మండల బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎన్నికలో అమలు కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినంక కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హామీలు అమలు చేసినందుకు పోరాటాలు చేస్తామన్నారు.


