Listen to this article

జనం న్యూస్ మార్చి 24: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో

ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోమంగళవారం పీఎం శ్రీ మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు ఎంతో చక్కగా, ఆకర్షణీయంగా నిర్వహించారు. పార్లమెంట్‌లో జరిగే సమావేశాల తీరును అచ్చం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం.ఈ సందర్భంగా స్పీకర్ విధులు, ప్రభుత్వ ప్రతినిధుల పాత్ర, ప్రతిపక్ష సభ్యుల బాధ్యతలు వంటి అంశాలను విద్యార్థులు సమర్థంగా ప్రదర్శించారు. ప్రశ్నోత్తర సమయం, జీరో అవర్, ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వంటి అంశాలను నిజ జీవితానికి దగ్గరగా చూపించి అందరినీఆకట్టుకున్నారు.ముఖ్యంగా స్పీకర్ పాత్రలో తొమ్మిదో తరగతి విద్యార్థిని శ్రీనిధిఅద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందింది.ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులకు పార్లమెంట్ వ్యవహారాలపై అవగాహన పెరుగుతుందని, సమాజంపై స్పష్టమైన దృష్టికోణం ఏర్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, విజయ్, రాజేందర్, శ్రీనివాస్, ప్రవీణ్, శర్మ, గంగాధర్, రాజనరసయ్య, గంగా మోహన్, ట్వింకిల్, సమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.