Listen to this article

జనం న్యూస్ 25 మార్చి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్‌కే. అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో గత వారం రోజుల వ్యవధిలో మొత్తం 13 అక్రమం రవాణా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంధార్బంగా యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 08 ట్రాక్టర్లను , కరణ్‌కోట్ ప్రాంతంలో అక్రమంగా కలప రవాణా చేస్తున్న 1 లారీని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం నవాబ్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమట్టి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 3 లారీలు సీజ్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలలో కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపినారు. ఎక్కడైనా అనుమానాస్పద రవాణా కనిపించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, రాత్రి పూటలు సహా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా సహజ వనరులను తరలించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ అధికారులు జనవరి నెలలో 22 అక్రమ రవాణా కేసులు, ఫిబ్రవరి నెలలో 9 అక్రమ రవాణా కేసులు, మార్చి నెలలో 20 మొత్తం ఈ సంవత్సరం 51 అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సహజ వనరుల సంరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.