అండగా ఉంటామని మేఘన్న భరోసా అందజేశారు.
జనం న్యూస్ : మార్చి 25 బుధవారం వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు నివాసి రేగడ్డ చింతలమ్మ అనారోగ్యంతో బుధవారం మరణించగా, ఆమె పార్థివ దేహానికి మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు మేఘన్న భరోసా రూ.5000 అందజేస్తూ , ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, రాములు యాదవ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, రణధీర్ రెడ్డి,కురుమూర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు.


