బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఎన్ సి సి ఎఫ్ మరియు(TS) టీఎస్ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో రైతు సేవా సహకార సంఘం బిచ్కుంద వారి శనగ కోనుగోలు కేంద్రంను వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి మరియు బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమా రమేష్ షట్కార్ గారిచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పడిగేల భాగ్యలక్షి ప్రేమ్ కుమార్, కౌన్సిలర్లు. దర్పల్ కార్తీక సంతోష్, దర్పల్ గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిని అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు రవి పటేల్, నాయకులు, భాస్కర్ రెడ్డి, సాహిల్ శెట్కర్, బండు పటేల్, ఖలీల్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్( MAO )అమర్ ప్రసాద్, బిచ్కుంద మార్కెట్ సెక్రటరీ రాజకుమార్, (Fscs ceo )సొసైటీ సి ఓ శ్రావణ్ కుమార్, ఏఈఓ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



