జనం న్యూస్ మార్చ్ 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపన్నపల్లి తండా ఇండస్ట్రీ ఏరియా” రెడీమిక్స్ కంపెనీ”లో అజిత్ కుమార్ సింగ్ సెక్యూరిటీ వర్కర్ గా గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది… ఏమి కారణం లేకుండా అజిత్ కుమార్ సింగ్ ని, డ్యూటీలో నుంచి తీసివేయడం జరిగింది… రెడీమిక్స్ సెక్యూరిటీ వర్కర్ అజిత్ కుమార్ సింగ్ కి సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల వేతనం మొత్తం 32000/- వేల “పిఐపిఎల్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బులు ఇవ్వకుండా, ఏదో రకంగా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేసుకుంటూ అజిత్ కుమార్ సింగ్ ని పట్టించుకోకపోవడం జరిగింది… అజిత్ కుమార్ సింగ్ రెడీ మిక్స్ సెక్యూరిటీ వర్కర్ కి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి అతని గురించి తెలుసుకొని రవి కార్యాలయం వద్దకు వెళ్లి సెక్యూరిటీ అజిత్ కుమార్ సింగ్ కి జరిగిన అన్యాయం చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన, రవి హుటాహుటిన, “శేర్లింగంపల్లి గోపన్నపల్లి తాండ రెడీమిక్స్ కంపెనీ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ వర్కర్ కు రావలసిన వేతనం గురించి పలుమార్లు చర్చించి, అజిత్ కుమార్ సింగ్ కి మొత్తం సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల వేతనం మొత్తం 32000/- వేల రూపాయలు ఇప్పించడం జరిగింది… అజిత్ కుమార్ సింగ్ సెక్యూరిటీ వర్కర్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన బి ఆర్ టి యు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి కి మా తరపున, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు… ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు..


