జనం న్యూస్ మార్చ్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జగన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత నుంచి మానసిక స్థితి కోల్పోయి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మతిభ్రమించి మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందం గురించి జగన్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి వారానికి పది రోజులకు జగన్ రెడ్డి ఒక్కసారి వచ్చి నోరు విప్పి అబద్ధాలు అసత్యాలు దీనిలో భాగంగా తల్లి చెల్లి విషయంలో కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించడం వారి గ్యాంగ్ చేత తల్లి చెల్లిపై అసందర్భ పేలాపం చేయించడం జగన్ రెడ్డికే చెల్లిందని, ఆస్తులు కోసం భూములు కోసం ఎంత నీచనికైనా దిగజారిపోవడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిందని నాగ జగదీష్ మండిపడ్డారు. 2019 నుండి 24 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్క పరిశ్రమ గాని ఒక్క ఉద్యోగం గానీ వేసిన పాపాను పోలేదని, సరి కదా కల్తీ నెయ్యి కల్తీ మద్యం 30 వేలమంది మరణానికి కారణం అయ్యాడని,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన ఫ్రాంక్లిన్ టెంపుల్, హెచ్ఎస్ బీసీ, ఐబీఎం, అమరాన్ బ్యాటరీ కంపెనీని, అనేక పరిశ్రమలను, పెట్టుబడుదారులను తరిమేసిన జగన్ రెడ్డి ఇప్పుడు గూగుల్ నేనే తీసుకొచ్చాను, అదానీ డేటా సెంటర్, ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలన్నీ కూడా తానే తెచ్చానని చెప్పడం నిసిగ్గుగా మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని నాగ జగదీష్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టిల్ 2022లోనే దావోస్ లో ఎంఓయూ చేసుకున్నామని, చెప్పిన జగన్ రెడ్డి, నిన్న విలేకరుల సమావేశంలో మిటల్ స్టీల్ ప్లాంట్ ఒరిస్సాలో 1,o4,000 కోట్లతో పనులు చేపడుతున్నారని గతంలో జగన్ రెడ్డి మాట్లాడిన విషయం మరిచిపోయే, నేడు నా హయాంలోనే మిట్టల్ ఆహ్వానించమని చెప్పడం ప్రపంచ జోక్ గా ఉందని నాగ జగదీష్ అన్నారు. చంద్రబాబు అందం గురించి మాట్లాడే ముందు చంద్రబాబుతో పోటీపడి పరిశ్రమలు నిరంతర కృషి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, 20 మాసాల్లో 20 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి, పరిశ్రమలను తీసుకురావడం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్న విషయం మీ అజ్ఞానికి తెలియకపోవడం బాధాకరం విచారకరమని నాగ జగదీష్ జగన్ రెడ్డికి ప్యాలెస్యులకు పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడే ధైర్యం లేని పిరికి సన్నాసి ఇటువంటి సంధి పేలాపలను పేలడం మానే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నిజాలు మాట్లాడే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జగన్ రెడ్డికి నాగ జగదీష్ సవాల్ విసిరారు.


