

వెంకటాపురం మండలం కొండాపురం ప్రభుత్వ పాఠశాల యజమాన్యం
విద్యార్థిని తిట్టి బెదిరిస్తున్నయాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ
పిబ్రవరి 12 ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : ములుగు జిల్లా (నూగూరు) వెంకటాపురం మండలం కొండాపురం ప్రభుత్వం పాట శాల యాజమాన్యం ఆధార్ కార్డు ఉంటేనే భోజనం పెడతా మని ఆదివాసి గిరిజన విద్యార్థిపై ప్రభుత్వ పాఠశాల యజమాన్యం ఇష్టం సారంగా తిడుతున్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలంలోని సూరవీడు పంచాయతీ శ్రీ రంగాపురం నుండి కొండాపురం కాలినడకననే కొండాపురం చదువు కోవడానికి రాకపోకలు చేస్తున్న విద్యార్థిని ఆధార్ కార్డు లేదు అని ప్రభుత్వ పాఠశాల యజమాన్యం ఆ విద్యార్థికి అన్నం పెట్టకుండా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మూడవ తరగతి చదువు చున్న విద్యార్థిని తిట్టి మీ ఇంటికి పో అని బెదిరిస్తున్న పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొని ఆ విద్యార్థికి విద్యాబోధన భోజనం పెట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం దేనని వారు డిమాండ్ చేశారు ఈ విషయం పై వెంకటాపురం మండలం ఎం ఇ ఒ,పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించారు