Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 26 సెల్ 9550978955

చిలకలూరిపేట మండలం లోని పసుమర్రు గ్రామంలో తమ పూర్వికుల ఆస్తి వారసత్వ ప్రకారం తమకు రిజిస్టర్ ద్వారా సంక్రమించాయని బి.సి యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు అన్నారు.ఆయన మాట్లాడుతూ తనకు 9సెంట్లు నా చెల్లికి 4 సెంట్లు మొత్తం 13 సెంట్లు స్థలము 1917,1959, 2015 సంవత్సరాలలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ స్థలము మాది అని కొంతమంది అక్రమాదారులు చెప్పడమే కాకుండా నడకదారి బాట ఉందని, డ్రైనేజ్ కాలువ ఉందని అంటున్నారు.నేను ఇతర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్లడం వలన పసుమర్రు గ్రామ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న అరుణాచలం ఉన్నప్పుడు నడక దారి బాట కావాలని ఆ రోజుల్లో అడగడం వలన సరే అని చెప్పాడం జరిగిందని, దాన్ని ఆసరాగా చేసుకోని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలానికి సంబంధించిన ఏటువంటి ధ్రువీకరణ పత్రాలు ఆ రోజుల్లో ఇవ్వ లేదని, ఈ మేరకు హైకోర్టు న్యాయవాది బేబిరాణిని సంప్రదించగా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందన్నారు. తమకు న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.న్యాయస్థానం ఎవరికి చెబితే స్థలం వారికి చెందుతుంది.పసుమర్రు గ్రామంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు కి చెందిన స్థలాన్ని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఇరు వర్గాల వారు కోర్టును సంప్రదించి ఉన్నారని, ఈ స్థలాన్ని సర్వే చేయమని సంబంధిత అధికారులకు న్యాయస్థానం ద్వారా ఆదేశాలు జారీ చేయించి ఉన్నామని, అందరమూ బీసీ వర్గీయులకు చెందిన వారమే, సమస్యలు లేకుండా సానుకూలంగా పరిష్కరించుకోవాలని, న్యాయస్థానం ఎవరికి చెబితే స్థలం వారికి చెందుతుందని బేబీ రాణితెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు బిసి నాయకులు, వేముల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఆల శివ గోపి యాదవ్, న్యాయవాదులు పాల్గొన్నారు.