Listen to this article

జనం న్యూస్ మార్చి 25: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని దోంచంద గ్రామంలో వాగు వద్ద అక్రమంగా నిల్వ చేసిన 17 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను, గుమ్మిర్యాల గ్రామంలో 6 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను గురువారం పోలీసు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది కలిసి సీజ్ చేశారు.మొత్తంగా మండలంలో 23 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్ చేయబడింది. తహసీల్దార్ మాట్లాడుతూ ఈ ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పంపిణీచేస్తామనిఅన్నారు.అక్రమంగా ఇసుక రవాణా, నిల్వ చేస్తే వాహనాల సీజ్‌తో పాటుయజమానులు, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వం బట్టాపూర్, తోర్తి గ్రామాలలో ఆన్లైన్ ద్వారా తక్కువ ధరలకు ఇసుక సరఫరా చేస్తున్నందున, ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, ఎస్సై పడాల రాజేశ్వర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.