Listen to this article

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పత్తిపాక గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది కోతులను తరిమే క్రమంలో పై అంతస్తు నుండి జారిపడి వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు అని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు వివరాల్లోకి వెళ్ళితే మండలం లోని పత్తి పాక గ్రామానికి చెందిన తడక కరుణాకర్ 51 సంవత్సరాలు అతను ఎల్ఐసి ఏజెంట్ ఉదయం సుమారు 7 గంటల సమయంలో తన ఇంటి పై అంతస్తులో కి కోతులు వచ్చినట్లు తన ఇంటి ప్రక్కనే ఉన్న గొల్లపల్లి భాస్కర్ తెలిపారు అతను వెంటనే పై అంతస్తుకు వెళ్లి వాటిని తరిమే క్రమంలో కోతులు ఒక్కసారిగా అతను మీదకి రావడంతో భయంతో తప్పించుకునే ప్రయత్నం లో కాలుజారి పై అంతస్తు నుండి కిందపడి పోయాడు ఈ ఘటన లో కరుణాకర్ కు తలకు కాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా అతని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు మృతుని భార్య వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు కరుణాకర్ మృతి తో పత్తి పాక గ్రామంలో విషాదం నెలకొంది పండుగ రోజు ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది…..