Listen to this article

జనం న్యూస్ మార్చి 27 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పై పోలవరం మండలం కాట్రేనికోన మండలాల్లో వివిధ గ్రామాలలో ముమ్మిడివరం తాణేల్లంక గురుకుల పాఠశాల ప్రక్కన శ్రీ కోదండరామస్వామి ఆలయం మరియు తాణేల్లంక బాడవ శ్రీ రామాలయం లంకాఫ్ తానేలంక కునారులంక అంబేద్కర్ కాలనీ మురమళ్ళ కేశనకుర్రు మాన్యంపొలం మరియు సిహెచ్ గున్నేపల్లి శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయాలలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు పర్యవేక్షణలో ఐ పోలవరం మండలం కేశనకుర్రు వాస్తవ్యులు పిన్నమరాజు వెంకటపతి రాజు (పెద్దన్నయ్య) వారిచే శ్రీరామనవమి సందర్భంగా స్వామివార్లకు శేషవస్త్రాలు పుష్పమాలలు అందించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు నేతాజీ నగర్ గ్రామంలో నూతనముగా ఏర్పాటుచేసిన అభయం ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొని కమిటీ వారిని అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గొలకోటి సాయిబాబు మట్ట సూరిబాబు బలసాడి సత్యనారాయణ పితాని శ్రీనివాసరావు మట్ట శ్రీనివాసరావు మొల్లేటి లక్ష్మణరావు పాలెపు ఆంజనేయులు నంద్యాల నరసింహస్వామి ముమ్మిడివరపు ఏడుకొండలు రెడ్డి రమణారావు రాధాకృష్ణ గాలిదేవర రమేష్ గుబ్బల సూర్య సత్యనారాయణ చింత వివేక్ విత్తనాల రమణ పురోహితులు కే భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.