జుక్కల్ మార్చి 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని గురువారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం రాగా సవర్గావ్ శివారులో మూడు ముక్కలాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై నవీన్ చంద్ర తన సిబ్బంది తో సవర్గావ్ గ్రామానికి వెళ్లి రైడ్ చేసి నలుగురు జూదరులు మరియు మూడు సెల్ ఫోన్లు 2520/- రూపాయల నగదును స్వాధీన పరచుకుని వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు, జుక్కల్ మండలంలో ఎవరైనా మూడు ముక్కలాట ఆడితే కేసులు నమోదు చేస్తానని ఎస్సై పేర్కొన్నారు


