జనం న్యూస్ మార్చ్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు మండల పరిధిలో కందికుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి త్రిఏకాహ కళ్యాణ పూజ కార్యక్రమంలో డీసీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్,శాంతి ప్రియ, దంపతుల, కుమారుడు సాయిఅనిరుద్, షర్మిల దంపతులచే కలశ స్థాపన నిర్వహించారు, వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయాలను పచ్చని తోరణాలతో విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు ఈ పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఏపీ మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు త్సవటపల్లినాగేంద్ర రావు(నాగు) చెయ్యరు సొసైటీ అధ్యక్షులు త్సవటపల్లి శ్రీను , తెలుగుదేశం సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు, కంది కుప్ప సొసైటీ అధ్యక్షులు నూకల మూర్తి ఆకాశపు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.



