Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955

పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకునరసరావుపేట డివిజన్ పరిధిలో డిఎస్పి హనుమంతరావు పర్యవేక్షణలో
చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డి.ఎస్ పి,హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ ఇందులో భాగంగా వేలూరు గ్రామంలో 21 ద్విచక్ర వాహనాలు, 14 మరణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని,విద్యార్థులు ఎక్కువగా గంజాయి వినియోగిస్తున్నారు, ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడి వారు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని తెలియజేశారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.స్థానిక ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని సమస్యతమైన గ్రామాల పై నిఘా ఉంచామని,ఎక్కడైనా గంజాయి, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లయితే పోలీసు వారికి సమాచారం అందించగలరని పేర్కొన్నారు.అలాంటి వారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.కార్డన్ సెర్చ్ ఈకార్యక్రమంలో సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది వేలూరు గ్రామంలో ప్రతి వీధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.