జనం న్యూస్ మార్చ్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
స్నేహబంధం విలువను ప్రతిబింబించేలా, రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి తన చిరకాల మిత్రుడు గొట్టుముక్కుల దేశాలు జన్మదిన వేడుకలను హృదయపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశాలు నివాసానికి వెళ్లిన పురంధర్ రెడ్డి, శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి స్వయంగా తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, “నా మిత్రుడు దేశాలు అష్ట ఐశ్వర్యాలతో, మంచి ఆరోగ్యంతో వందేళ్లు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి, మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఆయన మాటల్లో స్నేహం పట్ల ఉన్న ఆప్యాయత, గౌరవం స్పష్టంగా వ్యక్తమైంది.ఈ వేడుకలో శ్రీధర్, సూర్యనారాయణ, అఖిల్, శ్రీనివాస్, నరసింహారావు తదితరులు పాల్గొని దేశాలు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.


