

జనం న్యూస్ నిజామాబాద్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 11:- నేటి విద్యార్థులలో విద్యతో పాటు దేశభక్తి కూడా పెంపొందించాలని అప్పుడే దేశ స్వాతంత్ర్యం కొరకు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో దేశ భక్తుల కల నెరవేరుతుంది అని నగరంలో నేడు జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన,స్వామి వివేకానంద,నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతుల సందర్భంగా నిర్వహించిన ఖేలో భారత్ బహుమతులు విద్యార్థులకు ప్రదానం సందర్భంగా,విద్యార్థులను ఉద్దేశించి డా.వినయ్ దన్ పాల్ పేర్కొన్నారు. కాగా ఈ యొక్క బహుమతుల ప్రధానోత్సవ,కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.వినయ్ దన్ పాల్,బహుమతులు గెల్చుకున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కళాశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరు కూడా చెడు అలవాట్లకు బానిసలు కాకుండా,విద్యార్థులు ముందుగా తమ శారీరక మానసిక దృఢత్వం కోసం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా తమను తాము తీర్చి దిద్దుకోవాలి అని,ఇందుకు సంబంధించి, విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఖెలో భారత్ అనే కార్యక్రమాన్ని ఏ.బి.వి.పి. సంస్థ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు,ఇంకా భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగం చేస్తే వచ్చిన స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ వాదం కొరకు జరిపిన పోరాటంలో ఏ.బి.వి.పి.కి కూడా ఒక ముఖ్య స్థానం దక్కుతుందని ఈ సందర్భంగా డా.వినయ్ దన్ పాల్ తమ ప్రసంగంలో ఏ.బి.వి.పి.సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏ.బి.వి.పి.తెలంగాణ ప్రాంత ప్రముక్ మంత్రి లావన్ జి ఇందుర్ ప్రముఖ రెంజర్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.