Listen to this article

తూప్రాన్, ఫిబ్రవరి, 12.జనం న్యూస్ ; ఆర్యవైశ్య మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు గా తూప్రాన్ మున్సిపల్ 6వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త ను నియమిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన పల్లెర్ల రవీందర్ గుప్త తన నామినేషన్ దాఖలు చేయగా పోటీలో ఉండడానికి ఎవరు కూడా ముందుకు రాక పోవడంతో సింగిల్ నామినేషన్ పత్రాలను పరిశీలించి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి రేణికుంట్ల గణేష్ గుప్త, కోశాధికారి కొండ్లె మల్లిఖార్జున్ లు మాట్లాడుతూ తూప్రాన్ ఆర్యవైశ్య ముద్దు బిడ్డ లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త సమాజ అభివృద్ధికి, ఆర్యవైశ్యల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా ఎనలేని కృషి చేసి ఆర్యవైశ్య మహాసభ ఖ్యాతిని పెంచాలని సూచిస్తూ వాసవిమాత దీవెనలతో లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త ఆయురురాగ్యోలతో, అష్ట ఐశ్వర్యాలు కాలుగాలని కోరారు. అనంతరం ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త మాట్లాడుతూ ఈ మెదక్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ గుప్త, గౌరిష్ గుప్త కి, అలాగే తన ఎన్నికకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మెదక్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ చంద్రపాల్ గుప్త, మార్గదర్శకులు శివనంది నారాయణ , మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్త, మెదక్ జిల్లా రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు వట్కూరి వీరేశం గుప్త, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు చెగుంట రాజు గుప్త, కాళ్ళాకల్ మాధంశెట్టి వెంకటేష్ గుప్త, బుక్క అశోక్ గుప్త, పల్లేర్ల బాలేశ్ గుప్త, కోవూరి శ్రీనివాస్ గుప్త లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పై నమ్మకం ఉంచి మెదక్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గా నియమించి నందుకు పదవికి న్యాయం చేసి సద్వినియోగం చేసుకోని అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనదైన శైలిలో సామాన్యులకు సైతం తన సేవా కార్యక్రమాలు అందేలా కృషి చేసి ఆర్యవైశ్య మహాసభ ఖ్యాతిని ఆర్జించిపెట్టి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చి ఉన్నత స్థానం లో నిలుపెందుకు అందరి సహకారం తో తనకున్న అనుభవాన్ని క్రోడీకరించి కృషి చేస్తానని చెప్పారు. తన సహచర ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడుతూ ఎక్కడైతే తన అవసరం సహకారం ఉందో గుర్తించి అక్కడ ఖచ్చితంగా ముందుండి వాసవిమాత చల్లని దీవెనలతో సేవ చేస్తానని తెలిపారు.