Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955

చిలకలూరిపేట: ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలపై విద్యుత్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం చిలకలూరిపేట పట్టణంలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి సుమారు రూ. 1 లక్ష బకాయి ఉండటంతో, సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని కనెక్షన్ కట్ చేశారు. దీంతో పాటు తహసిల్దార్ కార్యాలయానికి రూ. 36 లక్షలు, మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ విభాగానికి ఏకంగా రూ. 2.80 కోట్ల బకాయిలు ఉన్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ (ADE) అశోక్ వెల్లడించారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.విద్యుత్ సరఫరా నిలిపివేతతో ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది,కంప్యూటర్లు, స్కానర్లు పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మున్సిపల్, రెవిన్యూ సేవలపై ప్రభావం: నిరంతరం ప్రజలతో బిజీగా ఉండే తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పనులు స్తంభించాయి.ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా సామాన్య ప్రజలు బలికావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు