జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955
చిలకలూరిపేట :పల్నాడు జిల్లా కలెక్టర్ మరియ పురపాలక సంఘం యొక్క స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ కృతిక శుక్లా, ఐఏఎస్ శనివారం నాడు చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణ అభివృద్ధి, పెండింగ్లో ఉన్న పౌర సేవలు మరియు ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.సమీక్షా సమావేశం ముఖ్యాంశాలు:శాఖల వారీగా సమీక్ష : మున్సిపల్, ఇంజినీరింగ్ , రెవెన్యూ,టౌన్ ప్లానింగ్ మరియు ఇతర అభివృద్ధి శాఖల పనితీరును కలెక్టర్ విభాగాల వారీగా క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజా సమస్యల పరిష్కారం…ప్రజల నుండి వచ్చే అర్జీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, పౌర సేవల్లో జాప్యం ఉండకూడదని ఆదేశించారు.పట్టణ అభివృద్ధి పనులు చిలకలూరిపేట పరిధిలో జరుగుతున్న వివిధ సివిల్ పనులు, పారిశుధ్యం మరియు తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు.వేసవి ముందస్తు జాగ్రత్తలు..ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరియు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులను కోరారు.


