జనం న్యూస్ మార్చి 28, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గములోని పరిగి మండలం
కల్లాపూర్, రాపోల్ భూ బాధితులు ఇటీవల వెలువడిన ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పన్నెండు వందల ఎకరాలు మంచిగా పంటలు వండే భూములను కాంగ్రెస్ ప్రభుత్వం మా భూములను తీసుకుంటుంది అని, ఆ భూములు కోల్పోతే మాకు బ్రతకడానికి ఏమీ లేదని మా జీవనాధారమే మాకు పంట పొలాలని అని ఆవేదన వ్యక్తం చేశారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారితో ఆవేదన వ్యక్తం చేసిన కల్లాపూర్, రాపోల్ గ్రామ రైతులు.
వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ నీ నిలిపివేసి మా జీవితాలను కాపాడాలని, మాకు ఉన్న ఒక్క ఆధారం ఆ భూమే అని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు.


