Listen to this article

జనం న్యూస్ మార్చ్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేటికీ 44 సంవత్సరాలు ప్రజాక్షేత్రములో బడుగ బలహీన హరిజన గిరిజన వర్గాలకు చేయూతనిచ్చి వారికి అండగా నిలబడిన ఏకైక శక్తి ఎన్టీ రామారావు అని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఒక ప్రకటనలో 44వ ఆవిర్భావ దినోత్సవం లో ప్రతి కార్యకర్త నాయకులు మహిళలు విద్యార్థులు రైతులు కార్మిక వర్గాలు పాల్గొని జేజేలు పలకాలని పిలుపునిచ్చారు. నాడు తెలుగు జాతి ఖ్యాతి కోసం ప్రపంచానికి తెలియజేసిన మహనీయులు తారక రామారావు అని, తెలుగు సంస్కృతిని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పార్టీకి తెలుగుదేశం గా నామకరణం చేయడం ఎన్టీఆర్ కే దక్కిందని నాగ జగదీష్ అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 36 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనిని, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వడమే పార్టీ మూల సిద్ధాంతమని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం పిలుపునిచ్చి, రా కదలిరా ఎన్టీఆర్ పిలుపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించిందని వయసుతో తేడా లేకుండా యువత వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు సైతం చైతన్య రథం వెంట పరుగులు తీసే వారిని పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది మాసాలలోనే ప్రభుత్వాన్ని అధికారాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు దేనిని నాగ జగదీష్ అన్నారు. ఎన్టీఆర్ మూల సిద్ధాంతాలకు కట్టుబడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నారని తుదకు ఎన్టీఆర్ వారసుడు మనుమడు లోకేష్ సైతం రాష్ట్రం అభివృద్ధి 20 లక్షల ఉద్యోగాలు కల్పన నిరంతరం కృషి చేస్తున్నారని, అటు నందమూరి ఇటు నారావారి రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తుందని నాగ జగదీశ్ ఆశాభావం వ్యక్తపరిచారు.//