జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 28 సెల్ 9550978955
చిలకలూరిపేట: విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సమావేశాలకు చిలకలూరిపేట నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APUWJ), అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నాయకులు, సభ్యులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిలకలూరిపేటకు చెందిన జర్నలిస్టు ప్రతినిధులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఐక్యతను చాటడంలోనూ, హక్కుల సాధనలోనూ ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అడపా అశోక్ కుమార్, రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, సీనియర్ రిపోర్టర్ ఆలపాటి ఆంజనేయులు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఉప్పాల సుభాని, సెక్రటరీ sd. సిద్ధిక్ , ఎన్. వి .ఎస్ ప్రసాద్, దివి దాసు, కొండపాటి రమేష్, నరసింహల శ్రీకాంత్, కొనికి సాంబశివరావు, శివ , ఫణి కుమార్ , బాలు నాయక్, రావిపాటి రాజా, పెనుమల మనోహర్, మరికొంతమంది తదితరులు ఉన్నారు.


