Listen to this article

మద్నూర్ మార్చి 28 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ గృహప్రవేశం కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాన్ని ప్రారంభించారు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇందిరమ్మ లబ్ధిదారులు డిసిసి అధ్యక్షులకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానిస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం మద్నూర్ ఉప సర్పంచ్ రమేష్ గారి నివాసానికి వెళ్లిన ఏలే మల్లికార్జున్ గారిని ఆత్మీయంగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది.