Listen to this article

జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య, విద్యార్థిని వేషధారణలో (స్టూడెంట్ గెటప్) పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమయ్యారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిల ఆట కట్టించేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖాకీ యూనిఫాం వదిలి, ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని సాధారణ విద్యార్థినిలా వెళ్లారు. పోలీసులు ఏ రూపంలోనైనా మన పక్కనే ఉంటారని నిరూపించిన ఎస్సై అమూల్య ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని స్థానికులు అభినందిస్తున్నారు. ఇది ఆకతాయిలకు ఒక గట్టి హెచ్చరిక అని వారు పేర్కొంటున్నారు…..