

జనం న్యూస్ 12 ఆలేరు యాదాద్రి జిల్లా రిపోర్టర్ (మండల రిపోర్టర్ ఎండీ జహంగీర్)ఆలేరు మండలంలోని కొలనుపాక వాగుపై హై లెవెల్ బ్రిడ్జి తక్షణమే నిర్మించాలిఅని నల్లాల బాయి ద్వారా గ్రామ ప్రజలకు తాగునీరు అందించాలి అని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణ పరిష్కారంగా పాత నల్లాల బావిధార గ్రామ ప్రజలకు నీటిని సరఫరా చేయాలని వాటర్ ప్లాంట్, తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గడ్డం నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది దీనివలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పోసినప్పటికీ చాలీచాలక ఇబ్బందులు పడుతున్నారు అలాగే వాటర్ ప్లాంట్ కు మిషన్ భగీరథ నీరు సరఫరా లేని మూలంగా గ్రామంలో ఫిల్టర్ నీరు లేక ప్రైవేట్ వాటర్ ప్లాంట్ వారు సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపించారు అలాగే సాగునీటి కోసం వాగులో నీటిని వదిలిన మూలంగా అనేక మంది ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు గత నెల రోజులుగా పదిమంది వాగులో పడి గాయాల పాలయ్యారు ఒకరు మరణించారు కాబట్టి గతంలో మంజూరైన హై లెవెల్ బ్రిడ్జి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు వెంటనే వాగుపై హై లెవెల్ బ్రిడ్జి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే గ్రామం పట్ల చొరవ తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మామిడాల సోమయ్య నాయకులు మామిడాల బాల మల్లేశం తలారి వెంకటేష గుండె బాల నరసయ్య పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మామిడాల ప్రవీణ్ నాయకులు మామిడాల మహేష్ పి వై ఎల్ నాయకులు కోలా క్రాంతి వడ్లకొండ నవీన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు