Listen to this article

జనం న్యూస్ 30 మార్చ్

మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ సర్పంచులు చందర్ చౌహన్ ,చిన్నా రెడ్డి , కరుణ్ రాజ్ లను ఈ రోజు ఉదయం ఇంటి వద్ద అరెస్టు చేసి. జహీరాబాద్ రూరల్ పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్బంగా తట్టు నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయ్యింది పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసి మూడు సంవత్సరాలు అయ్యింది బిల్లులు ఇవ్వడం చేతకాక పోలీసులను ప్రభుత్వ అధికారులను అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తే రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్తారని తట్టు నారాయణ మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లులను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు